Wednesday, January 22, 2025

రెండో టెస్టులో కివీస్ గెలుపు..

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో, చివరి టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది. 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ 40 (నాటౌట్), సాంట్నర్ 35 (నాటౌట్) జట్టును గెలిపించారు.

టామ్ లాథమ్ (26), డారిల్ మిఛెల్ (19) కూడా తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాకీర్ హసన్ (59) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ ఆరు, సాంట్నర్ మూడు వికెట్లు తీశారు. కాగా, సిరీస్‌లో తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News