Thursday, December 19, 2024

కష్టాల్లో న్యూజిలాండ్..

- Advertisement -
- Advertisement -

ఢాకా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా బంగ్లాదేశ్ అదరగొడుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్ మీరాజ్ మూడు, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టారు. కివీస్ టీమ్‌లో ఓపెనర్లు టామ్ లాథమ్ (4), డెవోన్ కాన్వే (11) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.

జట్టును ఆదుకుంటారని భావించిన కేన్ విలియమ్సన్ (13), హెన్రీ నికోల్స్ (1), వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (0) కూడా విఫలమయ్యారు. డారిల్ మిఛెల్ 12(బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే మరో 117 పరుగులు చేయాలి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో న్యూజిలాండ్ బౌలర్లు సఫలమయ్యారు. ముష్ఫికుర్ రహీం (35), షాదత్ (31) పరుగులు చేశారు. కివీస్ టీమ్‌లో సాంట్నర్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు. కాగా,రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 10 ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News