Friday, September 13, 2024

బంగ్లా నయా చరిత్ర.. సొంతగడ్డపై పాక్ ను మట్టి కరిపించారు

- Advertisement -
- Advertisement -

రావల్పిండి : టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. పాక్ గడ్డపై తొలి గెలుపును లిఖించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో ఆతిద్య జట్టును చిత్తుచేసి నయా విజయాన్ని అందుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లా 10తో ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక సొంత గడ్డపై పాకిస్థాన్‌కు వరుసగా తొమ్మిదో టెస్టు పరాజయం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 23/1తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది.

మహ్మద్ రిజ్వాన్ 51 (80 బంతులు: 6×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు షపికీ (37), బాబర్ అజామ్ (22) రాణించినా.. మిగతావారు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో బంగ్లాదేశ్ ముందు అత్యల్ప టార్గెట్ 30 పరుగులు మాత్రమే ఉంచగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లతో చెలరేగగా, మాజీ సారధి షకిబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు జకీర్ హసన్ 15 నాటౌట్ (26 బంతులు: 3×4), షద్మాన్ 9 నాటౌట్ (13 బంతులు: 1×4) జట్టును విజయతీరాలకు చేర్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో..
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171 నాటౌట్), సౌద్ షకీల్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191), శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) బ్యాట్‌తో చెలరేగారు. నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ రెండేసి వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి టెస్టును చేజేతులా బాంగ్లాకు కట్టిబెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News