ఢాకా: షేర్ బంగ్లా స్టేడియంలో ఆఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో బంగ్లా ఘన విజయం సాధించింది. 546 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద విజయంగా బంగ్లా రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. ఆఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 146 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో బంగ్లా 546 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో నజ్ముల్లా హుస్సేన్ శాంటో రెండు భారీ శతకాలు చేసి విజయంలో కీలక పాత్రం పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బంగ్లాదేశ్ తరపున ఆ జట్టుకు ఇదే అతి పెద్ద విజయం. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 675 పరుగులతో విజయం సాధించగా 1932లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 562 పరుగులతో తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తరువాత అతి పెద్ద విజయాన్ని బంగ్లాదేశ్ తన ఖాతాలో వేసుకుంది.
Also Read: పుజారాపై వేటు తప్పదా?