Friday, January 17, 2025

ఉత్కంఠ పోరులో బంగ్లా గెలుపు

- Advertisement -
- Advertisement -

రాహుల్ అర్ధశతకం వృథా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హసన్ మిరాజ్

 

ఢాకా : భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. వికెట్ తేడాతో భారత్‌పై బంగ్లా జట్టు విజయం సాధి ంచింది. కేఎల్ రాహుల్ 70బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు సాధించి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. రాహుల్ మిన హా మిగిలిన భారత బ్యాటర్లు నిరాశపరచడం తో రోహిత్‌సేన ఓవర్లలో 186పరుగులు చేసి కుప్పకూలింది. అనంతరం బౌల ర్లు విజృంభించి గెలుపు ఆశలు రేపినా బంగ్లా టెయిల్ ఎండర్లు అద్భుత పోరాటంతో బంగ్లా జట్టును గెలిపించారు. 46ఓవర్లలో 9వికెట్లను కోల్పోయి బంగ్లాదేశ్ లక్ష్యా న్ని ఛేదించి సాధించింది. వికెట్ తేడాతో విజయం సొంతం చేసుకున్న బంగ్లా జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
షకీబ్ పాంచ్ పటాకా
ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ధావన్ (7)ను హాసన్ మిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం (27) షకీబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో 48పరుగుల వద్ద భారతజట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఒక్క పరుగు తేడాతో పెవిలియన్‌కు చేరడంతో 49పరుగులకు రోహిత్‌సేన మూడో వికెట్ పడింది. ఈదశలో శ్రేయస్ అయ్యర్, రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. ఈ జోడీని హోసెయిన్ విడదీయడంతో అయ్యర్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. వాషింగ్టన్ సుందర్ (24) మినహాయిస్తే మిగిలినవారు సింగిల్ డిజిట్‌స్కోరుకే పరిమితం అయ్యారు. మొత్తంమీద ఓవర్లలో రోహిత్‌సేన పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5వికెట్లతో మెరవగా 4వికెట్లతో మిరాజ్ ఓ వికెట్ పడగొట్టి భారత్‌ను కుప్పకూల్చారు.
భారత బౌలర్ల శ్రమ వృథా
భారత్ నిర్దేశించిన లక్షఛేదనలో బంగ్లాజట్టు తడబాటుకు గురైంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో బంగ్లా బ్యాటర్లు పరుగులు సాధించడం కష్టసాధ్యమైంది. ఓపెనర్ హెసెయిన్ షాంటో (0)ను దీపక్ చాహర్ డకౌట్ చేయడంతో బంగ్లాజట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. చాహర్ అందించిన శుభారంభాన్ని అందుకున్న బంగ్లా జట్టును అడ్డుకున్నారు. హక్ (14), ముష్ఫికర్ రహీమ్ హాసన్ మహమూద్ (0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర బౌలర్ కుల్దీప్‌సేన్ ఈ మ్యాచ్‌లో అఫిఫ్ హోసెయిన్ (6) వికెట్‌తీసి ఖాతా తెరిచాడు. ఎబాదత్ (0) కుల్దీప్‌సేన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. 136 పరుగులుకే 9వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఓటమి అంచులకు చేరింది. అయితే బంగ్లాదేశ్ టెయిల్ ఎండర్లు అద్భుత బ్యాటింగ్‌తో భారత అడ్డుకున్నారు. మిరాజ్ 39బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్‌లతో 38పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ముస్తాఫిజుర్ రహమాన్ (10) అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. మొత్తంమీద బంగ్లాజట్టు 9వికెట్లు కోల్పోయి చేసి గెలుపొందింది. కెప్టెన్ లిటన్‌దాస్ 63బంతుల్లో 3ఫోర్లు, ఓ సిక్స్‌తో 41పరుగులుతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరిసిన మిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ 3వికెట్లు, కుల్దీప్‌సేన్, సుందర్ చెరో రెండు వికెట్లు, ఠాకూర్, చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News