Monday, December 23, 2024

సౌతాఫ్రికాకు బంగ్లాదేశ్ షాక్

- Advertisement -
- Advertisement -

 

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు లిటన్ దాస్ (50), తమీమ్ ఇక్బాల్ (50) జట్టుకు శుభారంభం అందించారు. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న షకిబ్ ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. యాసిర్ అలీ (50), మహ్మదుల్లా (25) కూడా రాణించడంతో బంగ్లా భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 276 పరుగులకే ఆలౌటైంది. వండర్ డుసెన్ (86), డేవిడ్ మిల్లర్ (79) రాణించినా ఫలితం లేకుండా పోయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ నాలుగు, తస్కిన్ మూడు, షరిఫుల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News