దుబాయ్: అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసంచేకుంది. తుదిపోరులో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ (47), మహ్మద్ శిబాబ్(40), మహ్మద్ ఫరీద్ (39), జవాద్ అబ్రార్ 20 మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు 35.2 ఓవర్లలో కేవలం 139 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మహ్మద్ అమన్ 26 పరుగులు చేసాడు. ఓపెనర్లు ఆయుష్(1), వైభవ్ సూర్యవంశీ(9) భారత్‌కు శుభారంభం అందించలేదు. లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ రాజ్ (24) రాణించినా లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. ఐదుగురు భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్ పరిమితమయ్యారు. దీంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు.