Tuesday, March 4, 2025

భారత్‌తో మా సంబంధాలు బలంగానే ఉన్నాయి : బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఢాకా : భారత్‌బంగ్లా దేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయనే వాదనలను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కొట్టి పారేశారు. ఢాకా, ఢిల్లీల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు. బీబీసీ బంగ్లాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. భారత్ బంగ్లాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తాయి. అవి వచ్చి పోయే మేఘాల్లాంటివి. తప్పుడు సమాచారం , దుష్ప్రచారాలే ఈ సంఘర్షణలకు కారణం. వీటిని తొలగించేందుకు , ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అధికారులు నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు.” అని యూనస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News