Thursday, January 23, 2025

ప్రజలను ఓటు వేయడానికి ప్రేరేపిస్తూ బంగూర్ సిమెంట్ మల్టీమీడియా ప్రచారం

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పూర్తినిస్తూ కొత్త మల్టీమీడియా ప్రచారాన్ని బంగూర్ సిమెంట్ ప్రారంభించింది. ‘ఓట్ సాలిడ్, దేశ్ సాలిడ్’ అనే ఈ ప్రచారం, దేశాన్ని మరింత పటిష్టంగా చేయడంలో ప్రతి వ్యక్తి ఓటు విలువను వెల్లడిస్తుంది. ఈ ప్రచారం వినూత్నమైనది ఎందుకంటే ఇది ప్రముఖ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించిన మునుపటి బ్రాండ్ లాంచ్ ప్రచారానికి సీక్వెల్ గా ఇది వచ్చింది.

‘ఓట్‌ సాలిడ్‌, దేశ్‌ సాలిడ్‌’ అన్నది ప్రచారంలోని కీలక సందేశం. మీరు పటిష్టమైన ఇంటిని నిర్మించడంలో బంగూర్‌ సిమెంట్‌ సహాయం చేసినట్లే, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా పటిష్టమైన దేశాన్ని నిర్మించడంలో సహాయపడగలరనే సందేశం ఇది అందిస్తుంది.

ఇంకా, బ్రాండ్ తన వెబ్‌సైట్ www.bangurcement.comలోని “వోట్ కా వచన్” బటన్ ద్వారా “ఓటు వేయాలనే ఉద్దేశ్యం” తెలుపమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఓటు వేస్తామని చేసే ప్రతి ప్రతిజ్ఞకు 1 కేజీ సిమెంటును విరాళంగా అందజేస్తానని బంగూర్ సిమెంట్ ప్రతిజ్ఞ చేసింది, దానిని సామాజిక సంక్షేమ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. బంగూర్ సిమెంట్ ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడంలో సహాయపడటానికి సంబంధిత NGOలు, స్వయం సహాయక బృందాలతో చేతులు కలిపింది.

ఈ ప్రచారం గురించి సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అఖౌరీ మాట్లాడుతూ.. “బంగూర్ సిమెంట్ ‘ఓట్ సాలిడ్ దేశ్ సాలిడ్’ ప్రచారం, ‘ఓటు కా వచన్’ ప్రతిజ్ఞ మా బ్రాండ్‌లు, ఉత్పత్తులు, నెట్‌వర్క్ ద్వారా సమ్మిళిత వృద్ధితో ప్రగతిశీల దేశాన్ని నిర్మించాలనే మా నిబద్ధతకు ప్రతిరూపం” అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News