Monday, December 23, 2024

బంజారాహిల్స్‌ సిఐ శివచంద్ర సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Banjara Hills CI Sivachandra suspended

హైదరాబాద్: బంజారాహిల్స్‌ సిఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీపీ సుదర్శన్ కు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఛార్జ్ మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని శివచంద్రను సస్పెండ్ చేస్తున్నట్టు సిపి ఆనంద్ పేర్కొన్నారు. పబ్ పై గతంలో ఫిర్యాదులు వస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. నగరంలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై శనివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్ లో కొకైన్, గంజాయి, ఎల్ఎస్ డీ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పబ్ యజమానితో సహా 144 మందిని అందుపులోకి తీసుకున్నారు. పోలీసులు పబ్ కు డ్రగ్స్ సరఫరాపై దర్యాప్తు ప్రారంభించారు. పబ్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్ లో డ్రగ్స్ కేసులో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News