Sunday, December 22, 2024

బంజారాహిల్స్‌లో డిసిఎంను ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న డిసిఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు డ్రైవర్‌తో మరొ ఇద్దరు గాయపడినట్టు సమాచారం. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: తొమ్మిదేళ్ళు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News