Sunday, December 22, 2024

బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలోని బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై మంగళవారం ఉదయం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఓ అపార్టుమెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కీలక సూత్రధారి శృతి అనే మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెడిసిన్ విద్యను మధ్యలోనే ఆపేసిన శృతి మరో ఇద్దరితో కలిసి ఆయుర్వేదిక్ వైద్యం పేరుతో స్పా సెంటర్‌ను నడుపుతోంది. నిందితురాలు శృతి గతంలో ఆర్నెళ్లపాటు జైలుకు వెళ్‌లినట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: ఢిల్లీ మెట్రోలో ముద్దుల వర్షం కురుపించిన యువ జంట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News