Monday, December 23, 2024

బిల్లర్లను బెదిరిస్తున్న నకిలీ రిపోర్టర్ల పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బిల్లర్లను డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్న నలుగురు నకిలీ విలేకరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….శ్రీనగర్‌కాలనీ, కమలాపురి కాలనీకి చెందిన వ్యాపారి మనీష్ జైన్ స్థానికంగా భవనాన్ని నిర్మించుకుంటున్నాడు. దీనిని గమనించిన నకిలీ రిపోర్టర్లు కిరణ్, విజయ్, శ్రీనివాస్, రవీందర్ రోజు వ్యాపారి మనీష్‌కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నలుగురు రిపోర్టుర్లు వ్యాపారికి రోజుకు 20 నుంచి 30 సార్లు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా బిల్డింగ్ ఫోటోలు తీసుకుని డబ్బులు ఇవ్వకుంటే భవనాన్ని కూల్చి వేయిస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు తెలిపాడు. ఐదేళ్ల క్రితం బిల్డింగ్ నిర్మిస్తుండగా ఇదే రిపోర్టర్లు వేధింపులకు గురిచేసి రూ.12లక్షలు తీసుకున్నారని వ్యాపారి ఆరోపించారు. నలుగురి వేధింపులు భరించలేక గతంలో డబ్బులు ఇచ్చానని తెలిపారు. వారి వేధింపులకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు రిపోర్టర్లపై పోలీసులు 573,447, 385,386,506 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News