Sunday, December 22, 2024

16 మంది ప్రాణాలను కాపాడిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎస్ ఐ కరుణాకర్ రెడ్డి 16 మంది ప్రాణాలను కాపాడారు. ప్రగతిభవన్ ముట్టడికి వచ్చిన 16 మంది ఎబివిపి కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎబివిపి కార్యకర్తలను తరలిస్తుండగా డిసిఎం నడిపే హోంగార్డు రమేష్ కు ఫిట్స్ రావడంతో డిసిఎం డివైడర్ పైకి దూసుకెళ్లింది. గమనించిన ఎస్ ఐ కరుణసాగర్ డిసిఎం నుంచి కిందకు దూకి వాహనాన్ని అదుపుచేశారు. ఈ ఘటనలో ఎస్ ఐ, కానిస్టేబుల్ సాయికుమార్ కు గాయాలయ్యాయి. ఎస్ ఐ చోరవతో 16 మంది ఎబివిపి కార్యకర్తలకు ముప్పు తప్పింది. కాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News