Monday, December 23, 2024

వాల్ వెనుక గోల్‌మాల్

- Advertisement -
- Advertisement -

Bank crisis in China?

చైనాలో బ్యాంక్ సంక్షోభం?
కాపలాకు దిగిన సైనిక ట్యాంకులు
వెలుగులోకి రాని ఆర్థిక క్షీణత?

బీజింగ్ : చైనాలో చాలా రోజులుగా బ్యాంకింగ్ రంగంలో తలెత్తిన సంక్షోభం చివరికి సైన్యం రంగ ప్రవేశంతో బ్యాంకుల రక్షణ చర్యలకు దారితీసింది. చైనాలో పలు ప్రముఖ కంపెనీలు మూతపడుతున్నాయి. తీవ్రస్థాయిలోనే ఆర్థిక సంక్షోభం నెలకొందని, అయితే ఇప్పటివరకూ వెలుగులోకి రాని ఈ అంశాలు ఇప్పుడు పలు ప్రముఖ బ్యాంకుల వద్ద మొహరించుకుని ఉన్న సైనిక ట్యాంకులు, చైనా సైనిక దళాల కాపలాలు సాగుతున్నాయి. తమ ఫిక్స్‌డ్ సేవింగ్ ఖాతాలలోని సొమ్ములు తిరిగి ఇచ్చివేయాలని పౌరులు బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో గుమికూడుతూ , అధికారులతో వాగ్యుద్థానికి దిగారు. అయితే నిబంధనల ప్రకారం ఈ సొమ్ము ఇచ్చివేయడం కుదరదని బ్యాంకు అధికారులు తెలియచేయడంతో కొన్ని చోట్ల బ్యాంకుల వద్ద ఉద్రిక్తతలు సాగుతున్నాయి. భద్రతా అధికారులపై డిపాజిట్‌దార్లు రాళ్లు రువ్వడం, బ్యాంకులలోకి చొచ్చుకుని పొయ్యేందుకు యత్నించడం జరుగుతోంది. ఈ వారంలో చైనాలోని పలు నగరాలలోని కూడళ్లలో సైనిక ట్యాంకులు కలియతిరుగుతున్నాయి.

దీనితో అక్కడ పరిస్థితిపై పలు రకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను వేలాదిగా తీసివేయడం జరుగుతోంది. హెన్నన్ ప్రాంత గ్రామీణ బ్యాంకు వద్ద ధర్నాలకు యత్నించడంతో వారిని చెదరగొట్టేందుకు సైనికులు రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రైవేటు భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగి, అణచివేతకు యత్నిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడైంది. ప్రజల పొదుపుఖాతాలు పెట్టుబడుల సాధనాలుగా ఉంటాయని, వీటిని అడగగానే విత్‌డ్రా చేయించుకోవడం కుదరదని హెన్నన్ బ్యాంక్ ఆఫ్ చైనా స్పష్టం చేసింది. అయితే తమ నిత్య సమస్యల పరిష్కారానికి వెంటనే డబ్బులు అవసరం అని, పలు విధాలుగా ఉపాధి లేకుండా పోతున్న తమకు తమ డబ్బు తీసుకునే హక్కు కాకపోయినా అవకాశం అయినా ఇవ్వరా? అని పౌరులు ప్రశ్నిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News