Monday, December 23, 2024

భర్త వేధింపులతో బ్యాంకు ఉద్యోగిని చెట్టుకు ఉరేసుకుంది…

- Advertisement -
- Advertisement -

అమరావతి: భర్త వేధింపులు తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిలా మాకవరపాలెం మండలం కె వెంకటాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హేమ అనే మహిళ నర్సీపట్నంలోని ఎస్‌బిఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. ఆమె మొదటి భర్త చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన సహాంత్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. అతడి వేధింపులో గత సంవత్సరం ఆత్మహత్యాయత్నం చేసింది.

మృతురాలికి మూడేళ్ల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. శుక్రవారం హేమ స్కూటీ గ్రామ శివారులో ఉన్న జీడితోటల్లోకి స్కూటీపై వెళ్లింది. స్కూటీ పార్కు చేసి సూసైడ్ నోట్ రాసి జీడి తోటలోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది. సూసైడ్ నోట్‌లో తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News