Sunday, April 13, 2025

అచ్చంపేటలో రైతుల ఖాతాల నుంచి కోటిన్నర కాజేసిన బ్యాంకు ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కేంద్రంలోని ఎస్ బిఐ ఉద్యోగి బాగోతం వెలుగులోకి వచ్చింది. 45 మంది రైతుల ఖాతాల నుంచి కోటిన్నర రూపాయలను బ్యాంకు ఉద్యోగి కిరణ్ తన ఖాతాకు మళ్లించాడు. దీంతో రైతులు తమ ఖాతాల నుంచి డబ్బులు మాయం కావడంతో బ్యాంకు మేనేజర్ కు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  ప్రారంభించారు. బ్యాంకు ఉన్నతాధికారుల కిరణ్‌ను సస్పెండ్ చేశారు. రైతుల నిలదీతతో డబ్బులు తిరిగి జమ చేస్తామని బ్యాంకు మేనేజర్ హామీ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News