Monday, December 23, 2024

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా ఆల్ ఇం డియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నా యి. సమ్మె కారణంగా చెక్ క్లియరింగ్ ఆలస్యం కావడంతో పాటు ఎటిఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ఒక రోజు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తెలియజేసిందని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ నవంబర్ 18న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం ఇచ్చింది.

సమ్మె కారణంగా పని కొంతమేరకు ప్రభావితం కావచ్చని ఎస్‌బిఐ తెలిపింది. ప్రతి నెల రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉం టుంది. అయితే ఇప్పుడు మూడో శనివారం స మ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. మరుసటి రోజు ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ చేయనున్నారు. ఎఐబిఇఎ ప్ర ధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం మాట్లాడు తూ, ఔట్‌సోర్సింగ్ జాబ్స్‌తో కస్టమర్ల గోప్యత దెబ్బతింటుందని, వారి డబ్బుకు ముప్పు ఉండనుందని అన్నారు. ఔట్‌సోర్సింగ్ వల్ల బ్యాంకుల్లో ఉద్యోగాల నియామకాలు తగ్గుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News