Wednesday, April 2, 2025

30నుంచి బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జనవరి 30, 31తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమాఖ్య తెలిపింది. ఈ నెల 30 సోమవారం, 31మంగళవారం రెండు రోజులపాటు దేశీయ బ్యాంక్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ రెండు రోజులకు ముందు సెలవు దినాలు కావడంతో జనవరి 28నుంచి నాలుగురోజులపాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ధ్రువీకరించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ తదితర డిమాండ్ల నెరవేర్చాలని యూనియన్లు కోరుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News