Sunday, December 22, 2024

డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజుల సెలవులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిసెంబర్‌లో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. ఈ నెల, శని, ఆదివారాలతో సహా వివిధ రాష్ట్రాల్లో సెలవులను కలిపితే 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జాతీయ సెలవులు కాకుండా ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) జారీ చేసిన సెలవుల జాబితాలో రాష్ట్రాల ప్రకారం పండుగ, వార్షికోత్సవ సెలవులు కూడా ఉన్నాయి.

డిసెంబర్‌లో వివిధ రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవం, క్రిస్మస్ మొదలైన వాటి కారణంగా కొన్ని రాష్ట్రాల్లో వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులు మూతపడినా ఖాతాదారులకు ఇబ్బందులు తక్కువే, ఎందుకంటే యుపిఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. నగదు ఉపసంహరణకు ఎటిఎం ఉపయోగించవచ్చు.

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
1 డిసెంబర్ : రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు
3 డిసెంబర్ :- ఆదివారం సెలవు
4 డిసెంబర్ :- సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా గోవాలోని పనాజీలో సెలవు
9 డిసెంబర్ : రెండో శనివారం సెలవు
10 డిసెంబర్ : ఆదివారం సెలవు
12 డిసెంబర్ : లాసంగ్/పా టోగాన్ నెంగ్‌మింజా సంగ్మా షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్ 13, 14 : లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 17 : ఆదివారం సెలవు
డిసెంబర్ 18, 2023- యు సో సో థామ్ వర్ధంతి కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 19 : గోవా విమోచన దినోత్సవంతో పనాజీలో సెలవు
డిసెంబర్ 23 : నాలుగో శనివారం
డిసెంబర్ 24 : ఆదివారం సెలవు
డిసెంబర్ 25 : క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 26 : ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు
డిసెంబర్ 27 : క్రిస్మస్ కారణంగా కోహిమాలోని బ్యాంకులు మూసివేత
డిసెంబర్ 30 : యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 31 : ఆదివారం సెలవు ఉంటుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News