Monday, December 23, 2024

వచ్చే నెలలో 10 బ్యాంక్ హాలిడేస్

- Advertisement -
- Advertisement -

Bank holidays in November 2022

న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో అక్టోబర్ నెల ముగియనుంది. వచ్చే నెల అంటే నవంబర్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సెలవు క్యాలెండర్‌లో ఈ వివరాలు ఉన్నాయి. నవంబర్ నెలలో అనేక పండుగలు ఉండడంతో బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, కనకదాస్ జయంతి, వంగ్లా ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవం, కుట్ ఫెస్టివల్, ఇంకా సెంగ్ కుత్సానేం వంటి అనేక పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు చాలా వరకు ఆయా రాష్ట్రాలకు చెందినవి. అందువల్ల భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చాలా బ్యాంకులు ఈ ప్రత్యేక రోజులలో తెరిచే ఉంటాయి. ఈ ప్రాంతీయ పండుగలు జరుపుకునే రాష్ట్రాల్లో మాత్రమే ఆ బ్యాంకులు మూసివేస్తారు. అక్టోబర్ నెల ముగిసి నవంబర్ ప్రారంభం కానుంది. ఈ పరిస్థితిలో వచ్చే నెలలో బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఈ సెలవులు గుర్తుంచుకుని, పనులు పూర్తి చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా తన వెబ్‌సైట్‌లో బ్యాంక్ హాలిడే జాబితాను అప్‌డేట్ చేస్తుంది. ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని చూసుకోవచ్చు. జాబితా ప్రకారం, నవంబర్ నెల బ్యాంకులో సెలవుతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు అంటే నవంబర్ 1 న బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏదైనా పని ఉంటే, వీలైనంత త్వరగా చూసుకోండి.

బ్యాంక్ సెలవులు ఇవే…
నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవ (కర్నాటక)
నవంబర్ 6 : ఆదివారం
నవంబర్ 8 : గురునానక్ జయంతి,
కార్తీక పూర్ణిమ, రహాస్ పూర్ణిమ
నవంబర్ 11 : కనకదాస్ జయంతి,
వంగలా ఫెస్టివల్
నవంబర్ 12 : రెండో శనివారం
నవంబర్ 13 : ఆదివారం
నవంబర్ 20 : ఆదివారం
నవంబర్ 23 : సెంగ్ కుత్సానేం
నవంబర్ 26 : నాలుగో శనివారం
నవంబర్ 27 : ఆదివారం
(ఈ సెలవులు ఆయా రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. ప్రాంతీయ సెలవులకు కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News