ముంబై : అక్టోబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుంది. త్వరలో నవంబర్ నెల ప్రారంభం కానుంది. భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతుంది. నవంబర్ నెలలోనూ బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) కస్టమర్ల సౌలభ్యం కోసం బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. నవంబర్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిలో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ మొదలైన పండుగ సెలవులు ఉన్నాయి. దీంతో పాటు శని, ఆదివారాలు సెలవులు కూడా దీనిలో ఉన్నాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా యుపిఐ ద్వారా ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఎటిఎంని ఉపయోగించవచ్చు.
ఈ సెలవుల జాబితా ఇదే..
నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవం,నవంబర్ 5 ఆదివారం సెలవు, నవంబర్ 10 గోవర్ధన్ పూజ, నవంబర్ 11న రెండో శనివారం, నవంబర్ 12, నవంబర్ 13 గోవర్ధన్ పూజ, దీపావళి ఉన్నాయి. నవంబర్ 14న దీపావళి (బలి ప్రతిపద), నవంబర్ 15న భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి, నవంబర్ 19 ఆదివారం సెలవు, నవంబర్ 20న- ఛత్ కారణంగా పాట్నా, రాంచీలలో బ్యాంకులు మూసివేస్తారు. నవంబర్ 23న సెంగ్ కుట్ స్నెమ్, ఇగాస్ బగ్వాల్ కారణంగా డెహ్రాడూన్, షిల్లాంగ్‌లలో సెలవు ఉంటుంది. నవంబర్ 25న నాలుగో శనివారం,
నవంబర్ 26న ఆదివారం, నవంబర్ 27న- గురునానక్ జయంతి, నవంబర్ 30న కనకదాస్ జయంతి సెలవులు