Monday, December 23, 2024

అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎక్కువే..

- Advertisement -
- Advertisement -

Bank holidays in October

న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందు చూసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దసరా, నవరాత్రి, దీపావళి వంటి పండుగల కారణంగా వివిధ ప్రదేశాలలో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 22 ఆదివారం, 23న నాలుగో శనివారం ఉంది. దీపావళి కారణంగా అక్టోబర్ 24న బ్యాంకులు పనిచేయవు. అక్టోబరు 4 నుంచి 9 వరకు వరుసగా 6 రోజుల పాటు గాంగ్‌టక్‌లో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్‌లో 8న, 22న (రెండో, నాలుగో శనివారాలు) కారణంగా సెలవులు ఉంటాయి. అలాగే అక్టోబర్ 1, 9, 16, 23, 30 తేదీల్లో ఆదివారాలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News