Monday, December 23, 2024

అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..

- Advertisement -
- Advertisement -

ముంబై : వచ్చే నెల అంటే అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు చూసుకుని ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే సుమారు 16 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉంది. 5 ఆదివారాలు, 2 శనివారాలు అంటే 6 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో 9 రోజుల పాటు బ్యాంకుల్లో పని ఉండదు. అక్టోబర్‌లో బ్యాంకులు ఏ రోజులలో మూసివేయనున్నారో ఇప్పటికే విడుదల చేసిన ఆర్‌బిఐ జాబితా ఉంది.
సెలవుల జాబితా
అక్టోబర్ 1న ఆదివారం, అక్టోబర్ 2న సోమవారం మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్- 8న ఆదివారం, అక్టోబర్ 14న శనివారం మహాలయ, అక్టోబర్ 15న ఆదివారం, అక్టోబర్ 18న బుధవారం కటి బిహు, అక్టోబర్ 21న శనివారం, దుర్గా పూజ (మహా సప్తమి), అక్టోబర్ 22న ఆదివారం, అక్టోబర్ 23, 24న సోమవారం, మంగళవారం దసరా, అక్టోబర్ 25న బుధవారం దుర్గా పూజ, అక్టోబర్ 26, 27న గురువారం దుర్గాపూజ, అక్టోబర్ 28న శనివారం లక్ష్మీ పూజ, అక్టోబర్ 29న- ఆదివారం, అక్టోబర్ 31న మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News