హైదరాబాద్ : గత 18 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న బ్యాంక్ మేనేజర్‌ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని దాదర్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న విఎస్ కెశిర్‌సాగర్ గతంలో మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూర్ మండలం, నందిగాంలోని వాణీ మెటాస్పిన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ 1995లో ఏర్పాటు చేశారు. కంపెనీ ప్రతినిధులు పబ్లిక్ ఇష్యూకు వచ్చి ప్రజలకు షేర్లు ఇస్తామని చెప్పి రూ.4,03,61,000 వసూలు చేశారు.
Also read: నిప్పులపై నడిచిన బీజేపీ నేత
తర్వాత కంపెనీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.3,71,32,120 విత్‌డ్రా చేసుకునేందుకు కెశిర్‌సాగర్ అనుమతి ఇచ్చాడు. తర్వాత కంపెనీ ప్రతినిధులు నష్టాల పాలయ్యామని చెప్పి మూసివేశారు. దీంతో అమాయకులైన ప్రజలు నష్టపోయారు. దీనిపై కొత్తూరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. తర్వాత కేసు సిఐడికి బదిలీ చేయడంతో తెలంగాణ ఎడిజి సిఐడి మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్సై నాగార్జున, హెచ్‌సి గోపాల్ తదితరులు బ్యాంక్ మేనేజర్‌ను పట్టుకున్నారు.