Thursday, August 29, 2024

ఖాతాదారులను మోసం చేసిన బ్యాంక్ మేనేజర్

- Advertisement -
- Advertisement -

ఖాతాదారులను మోసం చేసి ఓ బ్యాంక్ మేనేజర్ లక్షల్లో కొల్లగొట్టిన ఉదంతం వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఇద్దరు ఖాతాదారులను ఈ విధంగా మోసం చేసినట్లు తెలిసింది. సదరు ఖాతాదా రులకు లోన్ శాంక్షన్ చేస్తానని చెప్పి వారి వద్ద నుంచి బ్లాంక్ చెక్కులు తీసుకున్నాడని, అనంతరం లోన్లు శాంక్షన్లు చేసి కస్టమర్లు ఇచ్చిన బ్లాంక్ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడని తెలిసింది. ఈ విషయమై ఇద్దరు ఖాతాదారులలో ఒకరు నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. సదరు ఖాతాదారుడు అకౌంట్ నుంచి బ్యాంక్ మేనేజర్ రూ.20 లక్షలు స్వాహా చేసినట్లు టౌన్ సిఐ నరహరి వెల్లడించారు.

నిజామాబాద్ నగరానికి చెందిన కావేరీ ట్రేడర్స్ యజమాని పుల్లూరి రాకేష్ శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో వ్యాపార నిమిత్తం రుణం కోసం దర ఖాస్తు చేసు కున్నారు. ఇందుకు సంబంధించి సదరు వ్యాపారి సిసి లోనుగా దరఖాస్తు చేసుకున్నాడు. రుణం కోసం వ్యాపారి బ్యాంకుకు వెళ్లగా రూ.20 లక్షల రూపాయల ఖాతాదారుడి చెక్కులను బ్యాంకు మేనేజర్ అజయ్ నగదు రూపంలో మార్చుకుని కాజేసినట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు నాల్గవ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పరారీలో ఉన్న బ్యాంకు మేనేజర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బ్యాంక్ మేనేజర్ దొరికితే ఈ కేసులో ఇద్దరు బాధితులేనా? ఇంకెవరైనా బాధితులు ఉండే అవకాశం ఉందా? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News