- Advertisement -
హైదరాబాద్: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం అయింది. క్యాషియర్ ప్రవీణ్ రూ.22.53 లక్షలు తీసుకెళ్లాడని ఫిర్యాదు నమోదైంది. నిన్న మధ్యాహ్నం క్యాషియర్ డబ్బు తీసుకుని పరారైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్నటి నుంచి ప్రవీణ్ కనిపించకుండా పోయాడు. క్యాషియర్ పై పోలీస్ స్టేషన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ను ఎవరన్న కిడ్నాప్ చేశారా?.. లేదా డబ్బులు తీసుకుని పరారయ్యాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేేస్తున్నారు.
- Advertisement -