Tuesday, December 24, 2024

ముగిసిన బరోడా బ్యాంక్ క్యాషియర్ కస్టడి

- Advertisement -
- Advertisement -

Bank of baroda cashier scam

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్‌నగర్ శాఖలో రూ.22.53 లక్షల మాయం కేసులో క్యాషియర్ ప్రవీణ్‌కుమార్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈక్రమంలో బ్యాంక్‌లో మాయమైన రూ.22.53 లక్షలకు సంబంధించి క్యాషియర్ ప్రవీణ్‌కుమార్ మూడు రోజుల పాటు ప్రశ్నించినప్పటికీ అతని నుంచి ఎలాంటి సమాధానం లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసు విచారణ విషయంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో నిందితుడిని కస్టడీ కోరుతూ మరోసారి కస్టడీ పిటిషన్ వేయాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా వనస్థలిపురంలోని బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.22.53 లక్షలను క్యాషియర్ ప్రవీణ్‌కుమార్ మాయం చేసినట్లు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాను ఏ తప్పు చేయలేదని బ్యాంకు నగదు లావాదేవీల్లో తేడాలు వస్తున్నట్లు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపించిన కొద్ది రోజులకే ప్రవీణ్ నేరుగా హయత్‌నగర్ కోర్టులో లొంగిపోయాడు. బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నిందితుడు ప్రవీణ్ పలు ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రవీణ్ ప్రస్తావించిన అంశాలపైనా దృష్టిసారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News