- Advertisement -
ముంబయి: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఓబి) ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంపర్ లాభాలు ఆర్జించింది. ఈ త్రైమాసికంలో నష్టాలనుంచి లాభాల్లోకి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.864 కోట్ల నష్టంతో పోలిస్తే.. ఈ ఏడాది రూ.1208 కోట్ల లాభాన్ని అందుకొంది. వడ్డీ ఆదాయాలు(ఎన్‌ఐఐ) 15.7 శాతం పెరిగాయి. గత సంవత్సరం ఈ ఆదాయం రూ.6816 కోట్లుగా ఉండగా ఇప్పుడది రూ.7892 కోట్లకు పెరిగింది. కాగా మరోవైపు ఎన్‌పిఎలలో స్వల్ప క్షీణత కనిపించింది. బ్యాంక్ నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్( ఎన్‌ఎన్‌పిఎ) మార్చి త్రైమాసికంలో 3.09 శాతంగా ఉండగా ప్రస్తుతం 3.03 శాతానికి తగ్గాయి. ఎక్స్‌చేంజిల ఫైలింగ్ ప్రకారం ఆర్గానిక్ రిటైల్ లోన్స్ 11.8 శాతం పెరగ్గా, వాహన రుణాల్లో 25 శాతం, వ్యక్తిగత రుణాల్లో 19.5 శాతం వృద్ధి ఉంది.
Bank of Baroda clocks Q1 profit
- Advertisement -