Monday, December 23, 2024

బ్యాంక్ ఆఫ్ బరోడా కు రూ.5 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.5 కోట్ల పెనాల్టీ వేసింది. ఈ విషయాన్ని శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. అంతేకాకుండా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్.. బీవోబీకి అదనంగా మరో రూ.2,750 వడ్డించింది. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బీవోబీ వెల్లడించింది. కాగా, గత నెలలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ పెద్ద మొత్తంలో ఫైన్ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల భారీ జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News