గన్‌ఫౌండ్రీ: తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి ‘బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజ్ ’ అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ పోలీస్ శాఖతో ఎంఒయు కుదిరినట్లు జనరల్ మేనేజర్, జోనల్‌హెడ్ నితీష్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణ డిజిపి అంజన్‌కుమార్ ఐపిఎస్‌తో అవగాహన ఒప్పందం ఆమోదం పొందిన తరువాత పోలీస్‌శాఖ తరుపున ఏడిజిపి సం క్షేమం, క్రీడలు అభిలాష బిస్త్ ఐపిఎస్‌తో తాము ఎంఒయు కుదిరినట్లు ప్రకటించారు. అనంతరం జోనల్‌హెడ్ నితీష్‌కుమార్ మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ (పిఏఐ) యోధ రిటైల్ పై ప్రత్యేక ఆఫర్‌ను డెబిట్, క్రెడిట్ కార్డు సేవలతో పాటు అనేక ప్రత్యేక ప్రయోజనాలను బ్యాంకు అందించనున్నది.
ఖాతాదారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.05 కోట్లు, విధి నిర్వాహణేతర సమయంలో మరణిస్తే రూ.90 లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.60 లక్షలు , పాక్షిక వైకల్యానికి రూ.30 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా అందించనున్నదని తెలిపారు. తమతో బ్యాంకింగ్ సేవలను పంచుకున్నందుకు పోలీస్‌శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అత్యంత శ్రద్ధ్దగా, ధైర్యంగా సేవలు చేస్తున్న పురుష, మహిళా పోలీసుల అవసరాలు తీర్చడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాకు అవకాశం కలగడం సంతోషకరమని జనర్ మేనేజర్ నితీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.