Thursday, January 23, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం రూ.4070 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో87.62 శాతం వృద్ధితో రూ.4070.1కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.2,168.1 కోట్లుగా ఉంది.అలాగే ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,878.07 కోట్లుగా ఉంది.గత ఏడాది ఆర్జించిన రూ.20,119.52 కోట్లతో పోలిస్తే ఇది 48.50 శాతం ఎక్కువ.

బ్యాంక్ నికర ఎన్‌పిఎలు గత ఏడాది రూ.12,652.47 కోట్లుగా ఉంటే జూన్ త్రైమాసికంలో రూ.7,482 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది.అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు గత ఏడాది ఉన్న 6.26 శాతంతో పోలిస్తే 3.51 శాతానికి తగ్గాయి.ఆటోమొబైల్ రుణాలు 22.10 శాతం, గృహరుణాలు 18.40 శాతం,వ్యక్తిగత రుణాలు82.90 శాతం, మార్టిగేజ్ రుణాలు 15.80 శాతం,విద్యారుణాలు 20.80 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ పేర్కొంది. వ్యవసాయ రుణ పోర్టుఫోలియో15.10 శాతం పెరిగిరూ.1,27,583 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News