Thursday, January 23, 2025

బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం మూడు రెట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌జూన్) బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం మూడు రెట్లు పెరిగింది. బ్యాంక్ నికర లాభం రూ.1,551 కోట్లతో 176 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.561 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.2,183 కోట్ల నుంచి రూ.3,752 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) వార్షికంగా 263 బిపిఎస్ తగ్గగా, నికర ఎన్‌పిఎ 56 బిపిఎస్ తగ్గింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.5,915 కోట్లతో 45 శాతం పెరిగింది. జూన్ 30 నాటికి బ్యాంక్ దేశవ్యాప్తంగా 5,129 బ్రాంచ్‌లను కల్గివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News