Sunday, December 22, 2024

హనుమకొండలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) కొత్త అత్యధునాతన బ్రాంచ్‌ను హనుమకొండలో శనివారం ప్రారంభించింది. హనుమకొండ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నక్కలగుట్ట ప్రాంతంలో సర్కూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో బిఒఎం బ్రాంచ్‌కు ప్రారంభోత్సవం చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మహమ్మద్ షాహజీబ్, హనుమకొండ బ్రాంచ్ సిబ్బంది సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. హనుమకొండ బ్రాంచ్ ప్రారంభంతో బిఒఎంకు తెలంగాణలోని 33 జిల్లాలలో 65 బ్రాంచ్‌లు ఉన్నట్లు అయింది. హనుమకొంద బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి అతిథులకు, బ్రాంచ్ ప్రారంభోత్సవానికి హాజరైన కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News