Friday, December 27, 2024

రుణాలు, డిపాజిట్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్

- Advertisement -
- Advertisement -

Bank of Maharashtra tops in loans and deposits

తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలో అగ్రస్థానం

మన తెలంగాణ/హైదరాబాద్: 2022 -23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిపాజిట్లు రుణ వితరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నిటిలోకి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో పుణె ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ బ్యాంక్ మొత్తం రుణ వితరణలో 27.10 శాతం వృద్ధిని నమోదు సి రూ. 1,40,561 కోట్ల మేర రుణాలను వితరణ చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి విడుదల చేసిన త్రైమాసిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.43 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 15.73 శాతం వృద్ధితో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 13.66 శాతం వృద్ధితో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే రుణాల మొత్తం విలువతో పోల్చినట్లయితే ఎస్‌బిఐ 24,50,821 కోట్లతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకన్నా 17 రెట్లు ఎక్కువగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.6,95,493 కోట్ల రుణ వితరణతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకన్నా అయిదు రెట్లు ఎక్కువగా ఉంది. ఇక డిపాజిట్ల వృద్ధి విషయానికివస్తే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 12.35 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.1,95,909 కోట్ల డిపాజిట్లు సేకరించింది. 9.42 శాతం వృద్ధితో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో, 8.51 శాతం వృద్ధితో బ్యాంక్ ఆఫ్ బరోడా మూడో స్థానంలో ఉన్నాయి. మొండి రుణాలు తగ్గుముఖం పట్టడంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మంచి లాభాలు ఆర్జించాయి. రాబోయే త్రైమాసికాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News