Saturday, November 23, 2024

బ్యాంకులు సేవలు విస్తరించి అర్హులకు రుణాలివ్వాలి: అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Bank services should expand

మన తెలంగాణ,సిటీబ్యూరో: మారిన సాంకేతిక పరిస్దితుల ఆధారంతో బ్యాంకుల సేవలను మరింత విస్తరించి అర్హులైన వారందరికి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బ్యాంకుల సహకారంతో పెద్ద ఎత్తున లబ్దిదారులకు రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసినరుణ విస్తరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనచేసిన కార్యక్రమం ప్రారంభించారు.

ఈసందర్బంగా మాట్లాడుతూ ఎలాంటి పూచీకత్తు లేకుండా పేదవారు సైతం 50వేల నుంచి 10లక్షల వరకు రుణాలు పొందేలా చూడాలన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారులకు రుణాలు అందజేసేందుకు ముందుగా వారిలో అవగాహన కల్పించేందుకు రుణ విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా అన్ని శాఖల సమన్వయంతో బ్యాంకుల సహకారంతో పెద్ద ఎత్తున లబ్దిదారులకు రుణాలు అందించే ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈరుణ విస్తరణ కార్యక్రమంలో రుణాలతో పాటు వాటిని పొందేందుకు అవసరమైన పత్రాలు, ఇతర వివరాలను ఆయా బ్యాంకులు లబ్దిదారులకు తెలియజేస్తారని ఆయన వెల్లడించారు. అనంతరం ఎస్‌బిఐ స్దానిక ప్రదాన కార్యాలయం సిజిఎం అమిత్ జింగ్రాన్ ప్రసంగిస్తూ జిల్లాలో క్రెడిట్ డిపాజిట్ రేషియో 111శాతం ఉండటం మంచి పరిణామమన్నారు. అన్ని బ్యాంకులు కూడా ఈసిడి రేషియోను భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండేట్లు చూడాలన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఆయా బ్యాంకుల ద్వారా లబ్దిదారులకు రుణాలకు సంబంధించిన రూ. 223 కోట్ల చెక్కులను అందజేశారు. ఎల్‌డి ఎం. రవి శంకర్ ఠాగూర్, ఆయా బ్యాంకుల నియంత్రణ అధికారులు,ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News