Sunday, November 3, 2024

సీనియర్ సిటిజన్లకు అధిక ఎఫ్‌డి రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకులివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్(వృద్ధుల)కు అనేక పెట్టుబడి మర్గాలు ఉన్నప్పటికీ చిన్న పొదుపు పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి) వంటి సంప్రదాయ పథకాలను ఎంచుకుంటున్నారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(ఎస్‌సిఎస్‌ఎస్) వంటి పథకాలు ప్రత్యేకంగా వృద్ధుల కోసం రూపొందించగా, 2023 జులై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ పథకాలకు 8.2 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ ఎస్‌సిఎస్‌ఎస్ వడ్డీ రేట్లను సవరిస్తుంది. అనేక బ్యాంకులు కూడా వృద్ధులకు ఎస్‌సిఎస్‌ఎస్ పథకాల కంటే అధిక ఎఫ్‌డి రేట్లను అందిస్తూ పోటీపడుతున్నాయి. చాలా కాలం పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన తర్వాత చాలా బ్యాంకులు ఎస్‌సిఎస్‌ఎస్ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. కానీ చాలా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. జూలైలో దేశ ద్రవ్యోల్బణం రేటు 7.44 శాతానికి పెరిగింది. ఈ బ్యాంకులలో సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డి పథకాలపై 9.5 శాతం వరకు వడ్డీ రేటును పొందుతున్నారు.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంవత్సర కాలానికి సాధారణ ప్రజలకు 6.85 శాతం, వృద్ధులకు 7.35 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే విధంగా బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్‌డిలపై 4.50 శాతం నుండి 9.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. గరిష్ట వడ్డీ రేటును 15 నెలల నుండి 2 సంవత్సరాల ఎఫ్‌డీలపై మాత్రమే బ్యాంక్ ఇస్తోంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 3.75 శాతం నుంచి 8.25 శాతం ఎఫ్‌డి రేట్లను అందిస్తోంది. అలాగే వృద్ధులకు అదనంగా 0.75 శాతం వడ్డీ రేటను ఆఫర్ చేస్తోంది. 560 రోజుల ఎఫ్‌డిలకు సాధారణ కస్టమర్లకు 8.25 శాతం, వృద్ధులకు 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డిలపై సీనియర్ సిటిజన్‌లకు 4.50 శాతం నుండి 9.50 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. 1,001 రోజుల ఎఫ్‌డిపై బ్యాంక్ అత్యధికంగా 9.50 శాతం వడ్డీని అందిస్తోంది. సాధారణ కస్టమర్లు 4.50 శాతం నుండి 9.00 శాతం వరకు వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందుతున్నారు.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాదిరిగానే ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా వృద్ధుల ఎఫ్‌డి పథకంపై మెరుగైన రాబడిని అందిస్తోంది. బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డిలపై 3.60 శాతం నుండి 9.11 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. 750 రోజుల ఎఫ్‌డిపై అత్యధికంగా 9.11 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డిలపై 3.50 శాతం నుండి 9.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై సీనియర్ సిటిజన్‌లకు బ్యాంక్ అత్యధికంగా 9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఇఎస్‌ఎఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఇఎస్‌ఎఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 7 రోజుల నుండి 10 సంవత్సరాల ఎఫ్‌డిలపై 4.50 శాతం నుండి 9.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 2 నుండి 3 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీ రేటు 9 శాతం రాబడిని బ్యాంక్ అందిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News