Tuesday, January 21, 2025

నిషేదిత గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగ కార్యాచరణతో జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గుడుంబా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్‌ను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి గుడుంబా తయారు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే వారిని సంబంధిత తహశీల్దారుల ఎదుట బైండోవర్ చేయాలని సూచించారు. బెల్లం పటిక వంటి విక్రయాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలని అన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు సన్నద్దంగా ఉండాలని అన్నారు.

జిల్లా పరిధిలోని అన్ని బార్డర్ పిఎస్ పరిధిల్లో చెక్ పోస్టులకు ఏర్పాట్లు చేయాలని, అక్రమంగా మద్యం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా జిల్లాలోకి రవాణా అయ్యేందుకు అవకాశం ఉందని, దీన్ని అడ్డుకోవడంలో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌పిలు శ్రీనివాస్, రాజశేఖర్‌రాజు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రబాబు నాయక్, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్లు, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News