Friday, November 15, 2024

అండగా నేనుంటా: ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసు కున్నారు. ఈ సందర్భంగా భానోతు వెన్నెల మాట్లాడుతూ తమది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామం అని గిరిజన కుటుంబం అని తనకు చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టమని. అందులో భాగంగా ఈనెల 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమం జారో(5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించడం కోసం వెళుతున్నానన్నారు.

భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్, వెన్నెలను అభినందిస్తూ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తన వంతు సహాయంగా మూడు లక్షల (3,00,000) రుపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కుడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News