మన తెలంగాణ/హైదరాబాద్: వారసత్వ కట్టడాలను పునర్ నిర్మాణం ద్వారా వాటిని పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ పరిపాలన, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ చరిత్రకు సా క్షంగా నిలిచే బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని సోమవారం మ ంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి కెటిఆ ర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మా ట్లాడుతూ చారిత్రిక కట్టాలు కేవలం స్టీల్ , కాంక్రీటు నిర్మాణాలకు సంబంధించినవి కాదని నగర సంస్కృతి, వారస త్వ సంపద, అందమైన స్మారక చిహ్నాల కూర్పు అన్నారు. సాం స్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా బన్సీలాల్‌పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. చరిత్ర సాక్షంగా నిలిచే ఈ బావిని సంరక్షించుకోవడం ద్వారా స్థానికులు నగరానికి స్ఫూర్తిగా నిలవాలని మంత్రి కెటిఆర్ కోరారు.
మెట్ల బావి పునరుద్దరణలో ఎం తో శ్రమ దాగి ఉందని, దాదాపు 3900 మెట్రిక్ టన్నుల చె త్తను తొలగించి లారీల్లో 863 ట్రిపుల ద్వారా తరలించడం జరిగిందని చెప్పారు. 13 నెలల పాటు అహర్నిశలు శ్రమిం చి మెట్లబావికి సరికొత్త వైభావాన్ని తీసుకుకువచ్చిన జిహెచ్‌ఎంసి సిబ్బందితో పాటు స్థానికులకు మనస్సు పూర్తిగా శిరస్సు వంచి పేరు పేరునా ధన్యవాదాలను తెలుపుతున్నన్నారు. బన్సీలాల్ పేట్ మెట్ల బావి పునరుద్దరణకు రూ.10 కోట్లవ్యయం కాగా, ఇందులో హెచ్‌ఎండి( రూ.5 కోట్లు), జీహెచ్‌ఎంసీ(రూ.2 కోట్లు), జీడబ్ల్యూఎస్(రూ.2.5 కోట్లు) ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ(రూ.50 లక్షలు) భరించాయన్నారు. ఈ బావిని భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా ఆధునీకరించడం జరిగిందని, పర్యావరణ హితంగా, వాస్తు పరంగా నిర్మించన్నారు. 8 ఏళ్ల కాలంల్నో వేల కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ది చేసుకున్నామని, ఇందులో భాగంగా ప్లైఓవర్లు, అండర్ పాసులు ప్రారంభించిన్నప్పుడు కలగని సంతోషం ఇలాంటి కార్యక్రమాల్లో పా ల్గొన్నప్పుడు కల్గుతుందని మంత్రి చెప్పారు.
కేవలం బన్సీలాల్ పేట మెట్ల బావి మాత్రమే కాదని, ఇలాంటి వారసత్వ కట్టడాలైన మరో 43 మెట్లబావుల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ విజయలక్ష్మి తెలుపడం అభినందనీయమన్నారు. బన్సీలాల్ పేట మెట్ల బావి పునరుద్దరణ పనులను 25 సార్లు వచ్చి పరిశీలించినుట్ల మంత్రి తలసాని చెప్పారని,ఈ బావి ప్రత్యేకతను స్థానికులకు వివరించి పునరుద్దణకు చాల కష్టపడాల్సి వచ్చినట్లు ఆయన వివరించారని మంత్రి తెలిపారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీకుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఆరు మెట్ల బావులను ఇదే విధంగా ఆగాఖాన్ పౌండేషన్ ఆధునీకరించిందని, వాటికి యునెస్కో నుంచి అవార్డు కూడా రావడం జరిగిందన్నారు.
అదేవిధంగా నగరంలోని మొజాం జాహీ మార్కెట్, మీరాలం మంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్‌పేట్ సరాయిలాంటి చారిత్రాక కట్టడాలకు పూర్వ వైభవం ఉట్టి పడేలా ఎంతో అద్భుతంగా ఆధునీకరించుకున్నమన్నారు. హైదరాబాద్ నగరం మన సంస్కృతి, చరిత్రతో పాటు వారసత్వ సంపదకు నిదర్శనం గా నిలిచే వాటిని పునరుద్ధ్దరించుకోవడమే లక్షంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా ప్రపంచ వారసత్వ సంపద కలిగిన హైదరాబాద్ నగరంగా యునెస్కో ద్వారా గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.