అమరావతి: సహజీవనం చేసిన తరువాత ప్రియుడు ఆమెను పట్టించుకోవడంతో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసికొని తగలబెట్టుకొని చనిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాధవి అనే మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సదరు వ్యక్తి ఆమెను పట్టించుకోకపోవడంతో బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబడింది.
అదే సమయంలో రైల్వే మాజీ ఉద్యోగి లక్ష్మీ నారాయణ అక్కడి నుంచి వెళ్తుండగా అతడిని పట్టుకుంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మీనారాయణను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ గురువారం తెల్లవారుజామున దుర్మరణం చెందాడు. మాధవి బుధవారం రాత్రి చనిపోయింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.