Wednesday, January 22, 2025

పుట్టిన రోజుకు పిలిచి యువతిపై ఎస్‌ఐ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: సబ్ ఇన్స్‌పెక్టర్ తన పుట్టిన రోజులకు యువతిని పిలిపించి ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సమందర్ అవలీ అనే ఎస్‌ఐ అద్దంకి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేటప్పుడు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని రమ్మని యువతికి సదరు ఎస్‌ఐ కబురు పంపాడు. దీంతో యువతి అతడి ఇంటికి వెళ్లిన తరువాత మత్తు మందు ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు అశ్లీల చిత్రాలు తీశాడు. అశ్లీలో చిత్రాలతో బెదిరించి కూడా ఆమె పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వివాహం చేసుకోమని యువతి ఎస్‌ఐని కోరడంతో చంపుతానని బెదిరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెల్లడించారు.

Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News