Wednesday, January 22, 2025

బాలికను మామిడి తోటలోకి తీసుకెళ్లి… ఐదుగురు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ బాలికను మామిడి తోటలోకి తీసుకెళ్లి ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగింది. నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వేమూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి ఫెయిల్ కావడంతో ఇంటి దగ్గర ఉంటుంది. మూడు రోజుల క్రితం నిజాంపట్నం మండలంలోని ఓ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఆ గ్రామంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. శుక్రవారం సాయంత్రం బాలికకు యువకుడు ఫోన్ చేయగా ఆమె తన అమ్మమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఆమె ను బైక్ పై ఇద్దరు యువకులు గ్రామ శివారులోని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు యువకులు ఉండడంతో ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక కనిపించకపోవడంతో మేనమామ గ్రామంలో వెతికాడు. గ్రామ శివారు నుంచి బాలిక ఏడ్చూకుంటూ రావడంతో మేనమామ గమనించి అడిగాడు. జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గ్రామంలో డిజె పనులు చేస్తూ  అవారాగా తిరుగుతున్నారని పోలీసులు వెల్లడించారు. వారిని సజ్జావారిపాలెం వద్ద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News