Thursday, January 23, 2025

ఇదేం పద్ధతి… సంస్కృతికి విరుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో స్వలింగ వివాహాలు చెల్లనేరవని, వీటికి తాము వ్యతిరేకమంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) ఆదివారం ఓ తీర్మానం వెలువరించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం సోమవారం కానీ త్వరలో కానీ స్వలింగ వివాహాలపై తన తీర్పు వెలువరించే దశలో లాయర్ల సంఘం ఈ విధంగా తీర్మానం చేయడం కీలక పరిణామం అయింది. దేశ సంస్కృతి సంప్రదాయాలకు గే వివాహాలు విరుద్ధమని, దీనికి అనుమతించడం భారతీయతకు విరుద్ధం అవుతుందని బిసిఐ అధ్యక్షులు, న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా వార్తా సంస్థలతో మాట్లాడుతూ తెలిపారు. దేశానికి ఇంతకాలం ఓ నిర్ఠిష్లమైన సామాజిక మతపరమైన నిర్మాణం ఉంది. ఇది భారతీయుల మదిలో నాటుకుపోయింది. ఈ దశలో దీనికి విరుద్ధంగా స్వలింగ వివాహాల గురించి ప్రస్తావన రావడం, ఇందుకు అనుమతిని చట్టబద్ధం చేయాలనే ఆలోచన రూపుదిద్దుకోవడం మంచిది కాదని తాము భావిస్తున్నట్లు మిశ్రా తెలిపారు.

ఇటువంటి నిర్ణయాలు కోర్టు ద్వారా జరగకూడదు. ఏదైనా ఉంటే లెజిస్లేటివ్ ప్రక్రియ ద్వారా జరిగితే అది వేరే విషయం అవుతుందని స్పందించారు. దీనిని లాయర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొంటూ ఈ తీర్మానం వెలువరించామని వివరించారు. గత వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ గే పెళ్లిళ్ల విచారణ ప్రక్రియలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి మగ ఆడ అవసరమా? అని ప్రశ్నించారు. సోమవారం ఉదయం ఒక్క గంట ముందుగానే రాజ్యాంగ విస్తృత ధర్మాసనం విచారణకు కూర్చోనుంది. ఈ దశలో ఈ ధర్మాసనం ప్రత్యేకించి స్వలింగ వివాహాల విషయంలో తమ కీలక తీర్పు వెలువరిస్తుందని లేదా సంబంధిత విషయంలో నిర్థిష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News