Monday, December 23, 2024

పసికందు పాలతాగడంలేదని… వేడి వేడి నూనెలో వేళ్లను ముంచిన తల్లి

- Advertisement -
- Advertisement -

లక్నో: పసికందు పాలు తాగడంలేదని వేళ్లను వేడి వేడి నూనెలో ముంచిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇస్రౌలి గ్రామంలో ఇర్ఫాన్-ఆసియా బానో అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు జూన్ 11 న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మూడు నాలుగు రోజులు శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పటికి నాలుగో రోజు నుంచి పాలు తాగకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారితో తన బిడ్డ పాలు తాగడంలేదని చెప్పడంతో వాళ్లు వేడి వేడి నూనెలో వేళ్లను ముంచితే సరిపోతుందని సలహా ఇచ్చారు. దీంతో వేడి వేడి నూనెలో వేళ్లను ముంచుతుండగా నర్సు గమనించి వైద్యులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు ఆ పసిపాపక వైద్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో పిల్లలు పాలు తాగకపోవడంతోనే ఇద్దరు చనిపోయారని ఆ భయంతోనే ఈ చర్యకు పాల్పడ్డానని బాలింత వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News