Monday, December 23, 2024

భర్తతో గొడవ… పుట్టింటికి వెళ్తున్న మహిళపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

లక్నో: భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్తున్న మహిళను నలుగురు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు,.అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వివాహితపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరాబంకీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దేవా ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవ పెట్టుకొని తన అమ్మగారింటికి వెళ్తోంది. మార్గం మధ్యలో ముఘల్ అజమ్, అశ్రఫ్, షబ్బు, ఇస్లాముద్దీన్ కలిసి తన కారులో లిఫ్ట్ ఇస్తామని చెప్పారు.

ఆమె నిరాకరించడంతో కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగారు. అనంతరం ఆమె నోట్లో గుడ్డలు కుక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఫోన్‌లో వెంటనే ఆమె తన సోదరికి సమాచారం ఇచ్చారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌పి సిన్హా బాధితురాలిని వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నలుగురు నిందితులను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News