Thursday, January 23, 2025

అలరించే అంశాలు, కమర్షియల్ హంగులతో…

- Advertisement -
- Advertisement -

Barasala movie

 

శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మాతగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకొని త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్‌లు విచ్చేశారు. ముందుగా ప్రతాని, సాయివెంకట్‌ల చేతుల మీదుగా చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ జరిగింది. అనంతరం చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ “సినీ పరిశ్రమలో వివిధ రంగాలలో నేను పనిచేశాను. ఆ అనుభవంతో ఈ ‘బారసాల’ను తెరకెక్కించబోతున్నాను. నిర్మాత శ్రీనివాస్ మంచి అభిరుచిగల వ్యక్తి కావడం.. అలాగే మంచి రచయిత కావడం కూడా మా సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది”అని అన్నారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ “అందరినీ అలరించే అంశాలతో పాటు కమర్షియల్ హంగులు కూడా ఇందులో ఉంటాయి. త్వరలోనే సినిమాను ప్రారంభిస్తాం”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News