Thursday, January 23, 2025

కస్టమర్ ను చంపిన బార్బర్… కానీ

- Advertisement -
- Advertisement -

Barber murders Customer in Maharashtra

ముంబయి: షేవింగ్ చేస్తుండగా ఇద్దరు మధ్య గొడవ రెండు ప్రాణాలు తీసిన సంఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోధి గ్రామంలో వెంకట్ సురేష్ దేవకర్ (22) అనే వ్యక్తి సేవింగ్ కోసం సెలూన్‌కు వచ్చాడు. వెంకట్‌కు మారుతి షిండే అనే వ్యక్తి షేవింగ్ చేస్తుండగా డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి చేసిన తరువాత డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మారుతి పదునైన కత్తితో తీసుకొని వెంకట్ గొంతు కోయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ వెంకట్ బంధువులు అక్కడి చేరుకొని సెలూన్‌ను తగలబెట్టారు. అనంతరం అనిల్‌ను వెతికి పట్టుకొని కొట్టి చంపడంతో పాటు ఇంటిని కూడా తగలబెట్టారు. దీంతో గ్రామంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిన్వట్ పోలీస్ అధికారి అభిమాన్యు సాలుంకే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News