Sunday, December 22, 2024

కళ్యాణ కట్టలో క్షౌరకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : రాష్ట్రంలోని దేవాలయాల్లోని కళ్యాణ కట్టలలో పని చేస్తున్న క్షౌరకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరిన కళ్యాణ కట్టల నాయిబ్రహ్మణులు ,2017 సంవత్సరంలోనే సిఎం కెసిఆర్ తమకు మాట ఇచ్చారని ఇప్పటికైనా తమను గుర్తించి సమస్యను పరిష్కరించాలని యాదాద్రి వేములవాడ, సిద్దిపేట జిల్లా , నాచారం గుట్ట, కొమురవెల్లి, నల్లగొండ జిల్లా చెరువు గట్టు తదితర పలు దేవాలయాలో కళ్యాణ కట్టలలో పని చేస్తున్న నాయి బ్రహ్మణులు సిద్దిపేట నాయి బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు కొత్వాల్ యాద నరేందర్ ఆధ్వర్యంలో శనివారం నూతన సెక్రటరీయేట్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కొత్తపల్లి నర్సింలు, జానకిరాం, నేలకొండ రమేశ్, కనకరాజు, శేఖర్, దుర్గాప్రసాద్, చిన్న నర్సింహులు, నాగరాజు, మంగలి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News