Wednesday, January 22, 2025

అందరి కళ్లు జాసిమిన్‌పైనే..

- Advertisement -
- Advertisement -

నేడు బార్బొరాతో తుదిపోరు
వింబుల్డన్ ఓపెన్

లండన్: ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ జాస్‌మిన్ పౌలొని (ఇటలీ)తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా క్రెజ్సికొవా తలపడనుంది. ఇద్దరు అసాధారణ ఆటతో తుది పోరుకు దూసుకొచ్చారు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఇటు జాస్‌మిన్ అటు బార్బొరా చిరస్మరణీయ ఆటను కనబరిచారు. బార్బొరా ఇప్పటికే కెరీర్‌లో ఓసారి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. జాస్‌మిన్ మాత్రం కెరీర్‌లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది.

ఇద్దరు కూడా జోరుమీదుండడంతో పోరు ఆసక్తికరంగా సాగే ఛాన్స్ ఉంది. బార్బొరా కొంతకాలంగా అసాధారణ ఆటతో అలరిస్తోంది. ఒకప్పుడూ మహిళల టెన్నిస్‌లో మెరుగైన క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్నా బా ర్బొరా ఆ తర్వాత ఫామ్‌ను కోల్పోయింది. ఈ సీజన్‌లో మాత్రం మెరుగైన ఆటతో పూర్వవైభ వం దిశగా అడుగులు వేస్తోంది. జాస్‌మిన్‌తో జ రిగే ఫైనల్లోనూ గెలిచి తన కెరీర్‌లో రెండో గ్రాం డ్‌స్లామ్ సింగిల్స్ ట్రోఫీని జత చేసుకోవాలని భా విస్తోంది. ఇక ఇటలీ సంచలనం పౌలొని కూడా టైటిల్‌పై కన్నేసింది. అసాధారణ ఆటతో ఫైనల్‌కు చేరుకున్న పౌలొని తుది పోరులో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉంది. అద్భుత సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న పౌలొని ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

టైటిల్ పోరుకు అల్కరాజ్

వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ యువ సంచలనం, మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ అసాధారణ ఆటతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)ను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో అల్కరాజ్ 67, 63, 64, 64తో డానిల్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు అల్కరాజ్ అటు డానిల్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న డానిల్ విజయం సాధించాడు. అయితే తర్వాత జరిగిన మూడు సెట్లలో కూడా అల్కరాజ్ ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా మూడింటిలో గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News